`జాంబిరెడ్డి` ఫ‌స్ట్ బైట్‌: ‌వెన్నులో వణుకు పుట్టాల్సిందే!

`జాంబిరెడ్డి` ఫ‌స్ట్ బైట్‌: ‌వెన్నులో వణుకు పుట్టాల్సిందే!
`జాంబిరెడ్డి` ఫ‌స్ట్ బైట్‌: ‌వెన్నులో వణుకు పుట్టాల్సిందే!

క‌రోనా వ‌ర‌ల్డ్ మొత్తాన్ని వ‌ణికిస్తోంది. దీన్నే ప్ర‌ధాన ఇతివృత్తంగా తీసుకుని ప్ర‌శాంత్ వ‌ర్మ తెర‌కెక్కిస్తున్న జాంబీ థ్రిల్ల‌ర్ `జాంబిరెడ్డి`. `ఇంద్ర‌`తో పాటు ప‌లు చిత్రాల్లో బాల న‌టుడిగా అల‌రించిన తేజ స‌జ్జ ఈ మూవీతో హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఆనంది, ద‌క్షి హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. ఫ‌స్ట్ లుక్ నుంచి ఆస‌క్తిని రేకెత్తిస్తున్న ఈ మూవీ టీజ‌ర్‌ని శ‌నివారం స్టార్ హీరోయిన్ స‌మంత రిలీజ్ చేశారు. ఫ‌స్ట్ బైట్ పేరుతో విడుద‌లైన టీజ‌ర్ వెన్నులో వ‌ణుకు పుట్టించేలా వుంది.

`దైవం మ‌నుష్య‌రూపేనా అన్న‌ది ఇతిహాసం. రాక్ష‌సం మ‌నుష్య‌రూపేనా అన్న‌ది ప్ర‌స్తుతం` అంటూ `జాంబిరెడ్డి` టీజ‌ర్ సాగింది. దీంతో సినిమా క‌థేంటి? ఎలా వుండ‌బోతోంది అన్న‌ది స్ప‌ష్టంగా తెలుస్తోంది. మ‌న‌షిలో వున్న రాక్ష‌సుడు బ‌య‌టికి వ‌స్తే ఏంట‌న్న‌దే ఈ మూవీ ప్ర‌దాన క‌థాంశంగా క‌నిపిస్తోంది. దీనికి క‌రోనా వైర‌స్ ని యాడ్ చేసి కొత్త‌గా ఫినిషింగ్ ట‌చ్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. హ‌నుమాన్ భ‌క్తుడిగా తేజ గ‌ద ప‌ట్టుకుని క‌నిపిస్తే ఆనంది అమ్మ‌వారిలా త్రిశూలం ధ‌రించి జాంబీల‌పై విరుచుకుప‌డుతోంది. ద‌క్ష గ‌న్‌తో వేటాడుతోంది.

ఈ మ‌ధ్య‌లో వ్యాక్సిన్ కోసం ట్రై చేస్తున్న దృశ్యాల‌ని చూపించారు. మార్క్‌, కె. రాబిన్ నేప‌థ్య సంగీతం, అనిత్ ఫొటోగ్ర‌ఫీ ఈ మూవీకి మెయిన్ హైలైట్‌గా నిల‌వ‌బోతోంది. క‌ర్నూల్ నేప‌థ్యంలో ఈ మూవీని రూపొందించారు. ఇటీవ‌లే చివ‌రి షెడ్యూల్‌ని  స్టార్ట్ చేసి పూర్తి చేశారు. ఆపిల్ ట్రీ బ్యాన‌ర్‌పై రాజ‌శేఖ‌ర‌వ‌ర్మ నిర్మిస్తున్న ఈ మూవీ త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.