పైరసీ బారిన పడిన అల్లు శిరీష్ సినిమా


మలయాళంలో విజయం సాధించిన ఎబిసిడి చిత్రాన్ని తెలుగులో అదే టైటిల్ తో అల్లు శిరీష్ హీరోగా  మధుర శ్రీధర్ – యష్ రంగినేని సంయుక్తంగా నిర్మించిన చిత్రం  ఎబిసిడి . నిన్న ఈ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే . ఈసినిమా అలా విడుదల అయ్యిందో లేదో ఇలా పైరసి చేసి పడేసారు తమిళ రాకర్స్ . ఫుల్ మూవీ ని ఆన్ లైన్ లో పెట్టేసారు , చిన్న సినిమా అనే తేడా లేకుండా ఏ సినిమా రిలీజ్ అయినా సరే వెంటనే పైరసీ చేస్తున్నారు .

సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పై అల్లు శిరీష్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు కానీ ఈ హీరో ఆశలన్నీ అడియాసలే అయ్యాయి . సినిమాకు అంతగా పాజిటివ్ టాక్ రాలేదు దానికి తోడు ఇలా పైరసీ కావడంతో ఎబిసిడి పరిస్థితి ఏంటో ? సాలిడ్ హిట్ కోసం అల్లు శిరీష్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ కుదరడం లేదు పాపం .