వైరల్ గా మారుతున్న ఎన్టీఆర్ లీక్ ఫోటో


aravinda sametha photo leakedఎన్టీఆర్ తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ” అరవింద సమేత ” వీర రాఘవ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం లోని ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఎన్టీఆర్ – నాగబాబు లు ఇద్దరు కలిసి ఉన్న ఫోటో లీక్ అయ్యింది . ఆ ఫోటో లో ఎన్టీఆర్ ఆందోళనగా ఉండగా నాగబాబు మాత్రం అపస్మారక స్థితిలో గాయాల పాలైనట్లుగా కనబడుతున్నాడు . ఎమోషనల్ సీన్ గా కనిపిస్తోంది ఆ సీన్ , చిత్రంలో చాలా కీలకమైన సన్నివేశంగా కనిపిస్తోంది ఈ ఫోటో ని చూస్తుంటే .

రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యం కాబట్టి భావోద్వేగాలకు లోనయ్యే సన్నివేశాలు చాలానే ఉండనున్నాయి . ప్రస్తుతం ఈ స్టిల్ వైరల్ గా మారింది . ఎమోషనల్ తో కూడిన స్టిల్ కాబట్టి అరవింద సమేత చిత్రానికి మరింత ప్లస్ కావడం ఖాయం . ఈ స్టిల్ తో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరగడం ఖాయం . పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు , నాగబాబు , ఈషా రెబ్బా లు కీలక పాత్రలను పోషిస్తున్నారు . అక్టోబర్ 10న దసరా కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు కాగా ఈలోగా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని టీజర్ ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . త్రివిక్రమ్ – ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కాబట్టి భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ అరవింద సమేత వీర రాఘవ చిత్రం పై .

English Title : aravinda sametha photo leaked