చిత్రలహరి 7 రోజుల కలెక్షన్లు


మెగా మేనల్లుడు సాయి తేజ్ హీరోగా నటించిన చిత్రలహరి ప్రపంచ వ్యాప్తంగా 7 రోజుల్లో దాదాపు పది కోట్ల షేర్ రాబట్టింది దాంతో మెగా మేనల్లుడు సాయి తేజ్ తో పాటుగా ఆ చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది . చిత్రలహరి బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా 13 కోట్లకు మాత్రమే పోయింది అంటే మరో మూడున్నర కోట్లు వస్తే చిత్రలహరి చిత్రాన్ని కొన్న బయ్యర్లు ఒడ్డున పడ్డట్లే ! 
 
ఇక నిర్మాతలకు ముందుగానే పెట్టిన డబ్బులు దాదాపుగా వచ్చాయి . శాటిలైట్ , డిజిటల్ రైట్స్ , హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో మరింత ఆదాయం వస్తుంది కాబట్టి చిత్రలహరి హిట్ కిందే లెక్క . కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర వసూళ్లు ఇలా ఉన్నాయి . 
 
నైజాం                  –   3. 25 కోట్లు 
 
సీడెడ్                  –   1. 62 కోట్లు 
 
కృష్ణా                    –   72 లక్షలు 
 
గుంటూరు            –   79 లక్షలు 
 
ఈస్ట్                      –  93 లక్షలు 
 
వెస్ట్                       –  69 లక్షలు 
 
ఉత్తరాంధ్ర            –   1. 43 కోట్లు 
 
నెల్లూరు                 –   36 లక్షలు 
 
మొత్తం                    –  9. 79 కోట్లు