`ఆదిపురుష్` సెట్‌లో భారీ అగ్ని ప్ర‌మాదం!

fire accident on prabhas adipurush set 
fire accident on prabhas adipurush set

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న తొలి మైథ‌లాజిక‌ల్ చిత్రం `ఆదిపురుష్‌`. పాన్ ఇండియా స్థాయికి మించి ఈ చిత్రాన్ని టి సిరీస్ వారు అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా సెట్‌లో మంగ‌ళ‌వారం భారీ అగ్ని ప్ర‌మాదం జోటు చేసుకుంది. ఈ నెల 19న ఈ చిత్రానికి సంబంధించిన మోష‌న్ క్యాప్చ‌ర్ వ‌ర్క్ ని చిత్ర బృందం ప్రారంభించిన విష‌యం తెలిసిందే.

మంగ‌ళ‌వారం ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ ని ప్రారంభించారు. ఇందు కోసం ముంబైలోని గోరేగాన్ స్టూడియోలో భారీ సెట్‌ని నిర్మించారు. మంగ‌ళ‌వారం సాయంత్రం ఈ సెట్‌లో భారీగా మంట‌లు చెల‌రేగి అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. అయితే ఈ ఘ‌ట‌న‌లో యూనిట్‌లోని ఎవ‌రికీ ఎలాంటి ప్ర‌మాదం చోటు చేసుకోలేదు. దీంతో చిత్ర బృందం ఊపిరి పీల్చుకుంది.

మంట‌లు చెల‌రేగిన వెంట‌నే వేగంగా స్పందించిన చిత్ర బృందం 8 ఫైరింజ‌న్‌లు, 5 జంబో ట్యాంక‌ర్లు, ఓ జేసీబీని రంగంలోకి దింపి మంట‌ల‌ని అదుపుచేశాయి. అయితే ఈ అగ్ని ప్ర‌మాదంలో సినిమా కోసం వేసిన సెట్ మొత్తం కాలిపోయిన‌ట్టు తెలిసింది. ఈ ప్ర‌మాదానికి సంబంధించిన విజువ‌ల్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. షూటింగ్ తొలి రోజే అగ్ని ప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ క‌ల‌వ‌రానికి గురవుతున్నార‌ట‌.