ఐటీ రైడ్స్ ని తేలికగా తీసుకున్న దిల్ రాజు


మహర్షి నిర్మాత దిల్ రాజు పై ఐటీ దాడులు జరిగాయి . మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి చిత్రానికి ముగ్గురు నిర్మాతలు కాగా అందులో ఒకరు అగ్ర నిర్మాత దిల్ రాజు . అశ్వనీదత్ -పివిపి లతో కలిసి దిల్ రాజు మహర్షి చిత్రాన్ని నిర్మించాడు కానీ లెక్కలన్నీ దిల్ రాజుకు మాత్రమే తెలుసు కాబట్టి ఐటీ అధికారులు కూడా దిల్ రాజు ఆఫీసు పైనే చేసారు . అవసరమైతే అశ్వనీదత్ , పివిపి ల ఆఫీసులపై కూడా రైడ్స్ చేసే అవకాశం ఉంది . 
 
అయితే ఈ ఐటీ రైడ్స్ ని లైట్ గా తీసుకున్నాడు దిల్ రాజు . పెద్ద బడ్జెట్ చిత్రాలకు ఇలాంటి ఐటీ రైడ్స్ కామన్ అని , అందునా మహేష్ బాబు తో భారీ బడ్జెట్ తో తీసిన సినిమా కాబట్టి ఇంకా సహజమని తేలికగా కొట్టిపారేశాడు . ఇక టికెట్ల ధరల పెంపు గురించి మాట్లాడిన దిల్ రాజు ప్రభుత్వం ప్రత్యేక షోకు మాత్రమే అనుమతి ఇచ్చిందని , కోర్టు మాత్రం టికెట్ రేట్ల ని పెంచుకునే వెసులుబాటు కల్పించిందని సెలవిచ్చాడు . మహర్షి రేపు భారీ ఎత్తున విడుదల అవుతున్న విషయం తెలిసిందే .