మహర్షి హైలెట్స్


మహర్షి హైలెట్స్
మహర్షి పోస్టర్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ” మహర్షి ” . పూజా హెగ్డే మహేష్ సరసన నటించిన ఈ చిత్రం రైతు సమస్యల గురించి ఆధునిక భారతం గురించి సాగుతుందట . పోస్టర్ , ట్రైలర్ , టీజర్ లు కూడా ఇదే విషయాన్నీ స్పష్టం చేస్తున్నాయి . దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన మహర్షి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మే 9 న భారీ ఎత్తున విడుదల అవుతున్న విషయం తెలిసిందే . మహర్షి చిత్రం చాలా పెద్ద హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు మహేష్ . రిలీజ్ కి సిద్దమైన మహర్షి చిత్రమో హైలెట్స్ ఇవే అంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది . ఇంతకీ మహర్షి చిత్రంలో హైలెట్స్ ఏంటో తెలుసా …….

 

మహర్షి చిత్రంలోని హైలెట్స్ ఇవే నంట :

ఎమోషనల్ సీన్స్
రైతుల జీవన విధానంపై మహేష్ బాబు ఇచ్చే స్పీచ్
రామవరం ఎపిసోడ్
రైతుల సమస్యలు
అల్లరి నరేష్ ఎపిసోడ్
పూజా హెగ్డే గ్లామర్
చివరి 20 నిమిషాలు
రాత్రి పూట తీసిన యాక్షన్ సీన్స్
సాయి కుమార్ – మహేష్ మధ్య సాగే డైలాగ్స్
మహేష్ బాబు – జగపతి బాబు మధ్య వచ్చే సీన్స్
ప్రీ క్లైమాక్స్
కాలేజ్ ఎపిసోడ్
యు ఎస్ ఎపిసోడ్

ఇలా పెద్ద లిస్టే చెబుతున్నారు . అయితే ఇందులో ప్రేక్షకులు నిజంగా హైలెట్ గా భావించే సీన్స్ ఏంటి అన్నది మే 9 న తేలనుంది .