ఆగ‌స్ట్ 9న గ్రాండ్ రిలీజ్ అవుతున్న కింగ్ నాగార్జున `మ‌న్మ‌థుడు 2`


కింగ్ నాగార్జున‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం `మ‌న్మ‌థుడు 2`. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కుడు. మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వ‌యకామ్ 18 స్టూడియోస్ ప‌తాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్(జెమిని కిర‌ణ్‌) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగ‌స్ట్ 9న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా గురువారం ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.
నాగార్జున వ‌ర్జీన్ యువ‌కుడిగా బ‌య‌ట‌కు క‌న‌ప‌డతారు, కానీ మ‌రో ప‌క్క‌ అమ్మాయిల వెంట‌ప‌డే ఉమ‌నైజ‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డుతున్నారు. ఇలాంటి బోల్డ్ రోల్‌లో నాగార్జున న‌టించ‌డం ఇదే తొలిసారి.
టీజ‌ర్‌ను చూస్తుంటే సినిమాను లావిష్‌గా తెర‌కెక్కించార‌ని అర్థ‌మ‌వుతుంది. సినిమాటోగ్ర‌ఫీ పెద్ద ఎసెట్‌గా క‌న‌ప‌డుతుంది.
“ఎండిపోయిన చెట్టుకి నీళ్లు పోస్తే మళ్ళీ పూలు పూస్తాయా ??”

“పిల్లలకు కోచింగ్ ఇవ్వాల్సిన వయసులో నువ్వు బాటింగ్ కు దిగుతున్నావ్!”
టీజ‌ర్ చివ‌ర్లో ` ఐ డోంట్ ల‌వ్ ఆ ఓన్లీ మేక్ ల‌వ్ “ అనే చివ‌రి డైలాగ్ యూత్ ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా ఉంది.
సింగిల్ షెడ్యూల్ మిన‌హా సినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. సీనియ‌ర్ న‌టి ల‌క్ష్మి, వెన్నెల కిశోర్, రావు ర‌మేష్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.
చైత‌న్ భర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

న‌టీన‌టులు:
కింగ్ నాగార్జున‌
ర‌కుల్ ప్రీత్ సింగ్‌
ల‌క్ష్మి
వెన్నెల‌కిషోర్‌
రావు ర‌మేష్‌
ఝాన్సీ
దేవ‌ద‌ర్శిని త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: రాహుల్ ర‌వీంద్ర‌న్‌
నిర్మాత‌లు: నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్‌
నిర్మాణ సంస్థ‌లు: మ‌నం ఎంట‌ర్‌ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌యాకామ్ 18 స్టూడియోస్‌
మ్యూజిక్: చైత‌న్య భ‌రద్వాజ్‌
సినిమాటోగ్ర‌ఫీ: ఎం.సుకుమార్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్స్‌: ఎస్‌.రామ‌కృష్ణ‌, మౌనిక‌
స్క్రీన్‌ప్లే: రాహుల్ ర‌వీంద్ర‌న్, స‌త్యానంద్‌
ఎడిట‌ర్స్‌: ఛోటా కె.ప్ర‌సాద్‌, బి.నాగేశ్వ‌ర రెడ్డి
డైలాగ్స్‌: కిట్టు విస్సా ప్ర‌గ‌డ‌, రాహుల్ ర‌వీంద్ర‌న్‌
కాస్ట్యూమ్స్‌: అనిరుధ్ సింగ్‌, దీపికా ల‌ల్వాని