పవన్ కళ్యాణ్ మహర్షి చిత్రాన్ని చూస్తాడట !


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రాన్ని చూడటానికి ఉత్సాహం చూపుతున్నాడట . రైతు సమస్యలపై రూపొందిన చిత్రం కావడం పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు మహర్షి చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తుండటంతో మహర్షి చిత్రాన్ని చూడాలని డిసైడ్ అయ్యాడట పవన్ కళ్యాణ్ . జనసేన అనే రాజకీయ పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చాడు కనుక రైతుల సమస్యలపై మహర్షి ఏం చెప్పాడో అన్న ఆత్రుత పవన్ లో ఉందట .

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన తరుపున అభ్యర్థులను నిలబెట్టిన పవన్ ఫలితాల రాక కోసం ఎదురు చూస్తున్నాడు . మే 23 న ఎన్నికల ఫలితాలు రానున్నాయి , ఇక అప్పుడు ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి ఎవరో తెలిసిపోనుంది అలాగే పవన్ కళ్యాణ్ భవితవ్యం కూడా తేలిపోనుంది .ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాలను పక్కన పెట్టి మళ్ళీ సినిమాల్లోకి రావడం ఖాయమని వినిపిస్తోంది .