సుస్మా స్వరాజ్ చివరి ట్వీట్ వైరల్


Sushma Swaraj
Sushma Swaraj

కేంద్ర మాజీ మంత్రి సుస్మా స్వరాజ్ చివరిసరిగా చేసిన ట్వీట్ ఏంటో తెలుసా …… ”నరేంద్ర మోడీ జీ ….. ప్రధానమంత్రి గారు కృతఙ్ఞతలు ఈరోజు కోసమే నేను జీవితకాలం నుండి ఎదురు చూస్తున్నాను ” అంటూ ట్వీట్ చివరి ట్వీట్ చేసారు . ఇప్పుడా ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అంతకుముందు అమిత్ షా గురించి కూడా ప్రశంసలు కురిపించింది సుస్మా స్వరాజ్ .

ఆర్టికల్ 370 ని రద్దు చేయడం సాహసోపేతమైన చర్యగా అభివర్ణించింది సుస్మా స్వరాజ్ . ఆర్టికల్ 370 ని రద్దు చేసి కాశ్మీర్ ని భారత్ లో అంతర్భాగమని చాటి చెప్పాలని సుస్మా కూడా ఎంతో పోరాటం చేసింది . అయితే ఆ కోరిక నెరవేరిన సమయంలోనే సుస్మా స్వరాజ్ కన్నుమూయడంతో విషాద ఛాయలు నెలకొన్నాయి . సుస్మా స్వరాజ్ చనిపోవడంతో చివరి ట్వీట్ వైరల్ గా మారింది .