వైష్ణ‌వ్‌తేజ్ ఫోర్త్ ఫిల్మ్ డైరెక్ట‌ర్‌, హీరోయిన్ ఫైన‌ల్‌?

వైష్ణ‌వ్‌తేజ్ ఫోర్త్ ఫిల్మ్ డైరెక్ట‌ర్‌, హీరోయిన్ ఫైన‌ల్‌?
వైష్ణ‌వ్‌తేజ్ ఫోర్త్ ఫిల్మ్ డైరెక్ట‌ర్‌, హీరోయిన్ ఫైన‌ల్‌?

మెగా ఫ్యామిలీ హీరో వైష్ణ‌వ్ తేజ్ `ఉప్పెన‌` చిత్రంతో సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ రిలీజ్‌కి ముందే మ‌రో చిత్రాన్ని క్రిష్ డైరెక్ష‌న్‌లో పూర్తి చేసి షాకిచ్చారు. తాజాగా రెండ‌వ చిత్రం రిలీజ్‌కి ముందే మూడ‌వ చిత్రాన్ని బీవీఎస్ ఎన్ ప్ర‌సాద్ బ్యాన‌ర్‌పై శుక్ర‌వారం మొద‌లుపెట్టాడు. ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ల‌కుండానే వైష్ణ‌వ్ తేజ్ ఫోర్త్ ఫిల్మ్‌కి సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తోంది.

ఈ ఫోర్త్ ఫిల్మ్‌ని సెన్నిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల‌తో చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. స‌రికొత్త నేప‌థ్యంలో శేఖ‌ర్ మార్కు ఎలిమెంట్స్‌తో రూపొంద‌నున్న ఈ చిత్రంలో `గ్యాంగ్‌లీడ‌ర్‌` శ్రీ‌కారం చిత్రాల ఫేమ్‌ ప్రియాంక అరుళ్ మోహ‌న్ న‌టించ‌నున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. రొమాంటిక్ ల‌వ్‌స్టోరీగా రూపొంద‌నున్న ఈ మూవీని వ‌చ్చే ఏడాది సెట్స్ పైకి తీసుకువెళ్ల‌నున్నార‌ట‌.

ప్ర‌స్తుతం శేఖ‌ర్ క‌మ్ముల `ల‌వ్‌స్టోరీ` మూవీ రిలీజ్ ప‌నుల్లో బిజీగా వున్నారు. ఈ మూవీ త‌రువాత ఆయ‌న విక్ట‌రీ వెంక‌టేష్‌తో సినిమా చేస్తార‌ని వార్త‌లు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఇది పూర్త‌యిన త‌రువాతే వైష్ణ‌వ్‌తేజ్ మూవీ వుంటుంద‌ని తెలుస్తోంది.