అయ్యో! రిలీజ్ డేట్ మార్చుకున్నాడే !!


Rakshasudu Release date changed

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందిన చిత్రం రాక్షసుడు . ఈ చిత్ర విడుదల తేదీ మారింది తాజాగా . ఆగస్టు 2 న రాక్షసుడు చిత్రం విడుదల కానుంది ఆమేరకు ఓ ప్రకటన విడుదల చేసారు చిత్ర బృందం . తమిళంలో ఘనవిజయం సాధించిన రాక్షసన్ చిత్రాన్ని తెలుగులో రాక్షసుడు గా రీమేక్ చేసున్నారు . రమేష్ వర్మ దర్శకుడు గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో ఇక హీరోయిన్ గా అమలా పరమేశ్వరన్ నటిస్తోంది .

అసలు ఈ చిత్రాన్ని జూలై 18న విడుదల చేయాలనీ డేట్ ఫిక్స్ చేసుకున్నారు కట్ చేస్తే రామ్ హీరోగా రూపొందుతున్న ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని జూలై 12 నుండి 18 కి మార్చారు దాంతో రాక్షసుడు చిత్రాన్ని ఆగస్టు 2 కి వాయిదావేశారు . అదే రోజున శర్వానంద్ నటించిన రణరంగం కూడా వస్తోంది మరి ఆ సినిమా రిలీజ్ ఉంటుందో ? లేదో కానీ బెల్లంకొండ మాత్రం మరోసారి తన సినిమా రిలీజ్ డేట్ ని మార్చుకున్నాడు పాపం సక్సెస్ కోసం .