లారెన్స్ తమ్ముడిపై కేసు నమోదు


Case file against Raghava lawrence brother

హీరో , దర్శకుడు రాఘవ లారెన్స్ తమ్ముడు ఎల్విన్ వీణు పై కేసు నమోదు అయ్యింది . శాంతి (68 ) అనే మహిళ చెన్నై పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు . సంఘటన వివరాలలోకి వెళితే ……. శాంతి అనే మహిళ కొడుకు ఉదయ్ శంకర్ అయితే కోడలు తో గొడవలు జరుగుతుండటంతో ఆమె విడాకుల కోసం అప్లై చేసింది .

 

తన కొడుకు ఉదయ్ శంకర్ తో కోడలు కు విబేధాలు రావడానికి కారణం లారెన్స్ తమ్ముడు ఎల్విన్ వీణు కారణమని , అలాగే నా కొడుకు కనిపించకుండా పోయాడని అందుకు కారకులు నా కోడలు – లారెన్స్ తమ్ముడు ఎల్విన్ వీణు కారకులని ఈ ఇద్దరూ కలిసి నా కొడుకు ని ఏదో చేసారాని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించింది . శాంతి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు . అన్న లారెన్స్ సేవా కార్యక్రమాలతో బిజీ గా ఉంటే తమ్ముడి మీద ఇలాంటి ఆరోపణలు రావడం అంటే పెద్ద మరకేగా.

English Title : Case file against Raghava lawrence brother