ఎఫ్ 2 వారం రోజుల వసూళ్లు


 F2 Fun and Frustration 7 Days Worldwide Collections

వెంకటేష్ , వరుణ్ తేజ్ లు హీరోలుగా తమన్నా , మెహరీన్ లు హీరోయిన్ లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన చిత్రం ” ఎఫ్ 2 ” ఫన్ అండ్ ఫ్రస్టేషన్  సంక్రాంతి అల్లుళ్ళు అంటూ వచ్చిన ఈ సినిమా సంక్రాంతి రారాజుగా , సంక్రాంతి విజేత గా నిలిచింది . సంక్రాంతి బరిలో నాలుగు చిత్రాలు రిలీజ్ అయినప్పటికీ మిగతా సినిమాలను పక్కన పెట్టి ఈ సినిమా కోసం ఎగబడుతున్నారు జనాలు దాంతో భారీ వసూళ్లు వస్తున్నాయి . మొదటి వారంలో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 42 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది దాంతో 50 కోట్లకు పైగా షేర్ వసూల్ చేయడం ఖాయమై పోయింది . తెలుగు రాష్ట్రాలలోనే 35 కోట్ల షేర్ రాబట్టింది ఎఫ్ 2 చిత్రం . మరో వారం వరకు సరైన సినిమా ఏది లేదు కాబట్టి మరిన్ని మంచి వసూళ్లు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది .

ఏరియాల వారీగా ఎఫ్ 2 వసూళ్లు ఇలా ఉన్నాయి .

నైజాం                        –  11. 82 కోట్ల షేర్

సీడెడ్                        –  4. 70 కోట్ల షేర్
కృష్ణా                          –  3. 13 కోట్ల షేర్
గుంటూరు                 –  3. 14 కోట్ల షేర్
ఈస్ట్                           –  4. 26 కోట్ల షేర్
వెస్ట్                            –  2. 37 కోట్ల షేర్
ఉత్తరాంధ్ర                –  4. 75 కోట్ల షేర్
నెల్లూరు                    –   1. 18 కోట్ల షేర్
ఓవర్ సీస్                 –  5 కోట్ల షేర్
రెస్ట్ ఆఫ్ ఇండియా  –  2. 35 కోట్ల షేర్

మొత్తం                     – 42. 70 కోట్ల షేర్

English Title: F2 Fun and Frustration 7 Days Worldwide Collections