మూడు జాతీయ అవార్డులు కైవసం చేసుకున్న “మహానటి”

mahananti
mahananti

మహానటి సావిత్రి జీవిత కథాంశంతో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రతిష్ఠమాత్మక నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ పతాకాలపై ప్రియాంక దత్ నిర్మించిన చిత్రం మహానటి. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయి 50కోట్ల పైగా కలెక్ట్ చేసి అద్భుత విజయాన్ని సాధించింది.

మహానటి సావిత్రి జీవితాన్ని కళ్ళకు కట్టినట్లుగా ఈ చిత్రంలో చూపించి దర్శకుడు నాగ్ అశ్విన్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. విజయ్ దేవరకొండ, సమంత, దుల్కర్ సల్మాన్ ముఖ్య పాత్రల్లో నటించారు.

తెలుగు తమిళ్ భాషల్లో రూపొందిన ఈ చిత్రం నేషనల్ అవార్డ్స్ లో మూడింటిని కైవసం చేసుకుంది. ఉత్తమ తెలుగు చిత్రం మహానటి, ఉత్తమ నటి కీర్తి సురేష్, వుత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ కు అవార్డ్స్ దక్కాయి.మహానటి

ఈ మధ్య కాలంలో మూడు జాతీయ అవార్డ్స్ దక్కించుకున్న చిత్రం మహానటి కావడం ఎంతో గర్వంగా ఉందని చిత్ర యూనిట్ భావిస్తోంది.. ఈ చిత్రం తరువాత నాగ్ అశ్విన్ ఇంతవరకు మరే చిత్రం మొదలు పెట్టక పోవడం విశేషం. త్వరలోనే ఆయన ఓ పెద్ద హీరోతో సినిమా చేయనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.. !