తరుణ్ భాస్కర్ కు మహేష్ ఛాన్స్ ఇస్తున్నాడా ?


Mahesh Babu with Pelli Choopulu director Tharun Bhascker

పెళ్లిచూపులు చిత్రంతో సంచలన విజయం అందుకున్న దర్శకుడు దాస్యం తరుణ్ భాస్కర్ . పెళ్లిచూపులు తర్వాత ఈ నగరానికి ఏమైంది చిత్రం చేసాడు అది ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు దాంతో కొంత గ్యాప్ తీసుకున్నాడు . దర్శకుడిగా మెగా ఫోన్ ని పక్కన పెట్టి హీరోగా మారుతున్నాడు అయితే ఈ గ్యాప్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఓ లైన్ చెప్పాడట తరుణ్ భాస్కర్ . అది మహేష్ కు నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్ చెయ్ తప్పకుండా చేద్దామని అన్నాడట .

 

దాంతో పూర్తిస్థాయి స్క్రిప్ట్ చేసే పనిలో పడ్డాడట తరుణ్ భాస్కర్ , అయితే ఇప్పటికే మహేష్ బాబు తో సినిమాలు చేయడానికి పలువురు దర్శకులు క్యూ లో ఉన్నారు వాళ్ళని పక్కన పెట్టి తరుణ్ భాస్కర్ కు ఇప్పుడే ఛాన్స్ అంటే కష్టమే ! అయినా వాళ్ళు అధికారికంగా ప్రకటిస్తేనే ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఉన్నట్లు లేకపోతే లేనట్లే !

English Title : Mahesh Babu with Pelli Choopulu director Tharun Bhascker?