చంద్రబాబుపై విరుచుకుపడిన పవన్ కళ్యాణ్


Pawan kalyan fires on chandrababu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పై అలాగే ఆయన తనయుడు నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిప్పులు చెరిగాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ . నిన్న జనసేన ఆధ్వర్యంలో ధవలేశ్వరంలో నిర్వహించిన భారీ కవాతులో చంద్రబాబు ప్రభుత్వ పనితీరుపై విరుచుకుపడ్డాడు పవన్ కళ్యాణ్ . 2014 ఎన్నికల్లో మాకు సత్తా లేక కాదు కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి అనుభవమున్న నాయకుడు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీకు మద్దతు ఇస్తే అధికారంలోకి వచ్చాక మా అభిప్రాయాలు తీసుకున్నారా ? అధికారం కట్టబెడితే మీరు చేసిన అభివృద్ధి ఏది ? ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది , కనీసం పంచాయితీ సర్పంచ్ గా ఎన్నిక కాలేని లోకేష్ ని ఏకంగా పంచాయతీరాజ్ సఖా మంత్రిగా ఎలా నియమిస్తారు అంటూ చంద్రబాబు పై నిప్పుల వర్షం కురిపించాడు .

అంతేనా పనిలో పనిగా ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ ని కూడా ఏకి పారేసాడు పవన్ . ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో జగన్ పాత్ర శున్యమని ఆ పని జనసేన చేసిందని జగన్ వైఖరిని దుయ్యబట్టాడు అంతేకాదు ఫ్యాక్షన్ రాజకీయాలను గోదావరి జిల్లాలలోకి తీసుకురావాలని చూస్తే తన్ని తరిమేస్తానని , గోదావరిలో కలిపేస్తా నని జగన్ కు కూడా వార్నింగ్ ఇచ్చాడు పవన్ . ఇక ఏతా వాతా చెప్పేదేమంటే ….. వచ్చే ఎన్నికల్లో నన్ను ముఖ్యమంత్రి ని చేయండి జనరజకమైన జనసేన పాలన అందిస్తానని . మరి ప్రజల తీర్పు ఎలా ఉంటుందో 2019 వేసవిలో తేలనుంది .

English Title: Pawan kalyan fires on chandrababu