నీకిది అవసరమా హీరో ?


Sai dharam tej turns writer ?

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా పరిచయమై మంచి విజయాలు అందుకున్నాడు కట్ చేస్తే వరుసగా ఘోర పరాజయాలు ఎదుర్కొంటూ కెరీర్ పరంగా డోలాయమానంలో పడ్డాడు . వరుసగా ఆరు డిజాస్టర్ లు రావడంతో సాయి ధరమ్ తేజ్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యింది . ఇలాంటి పరిస్థితిలో చిత్రలహరి అనే సినిమా చేస్తున్నాడు సాయి ధరమ్ తేజ్ . ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యాక తన సొంత కథతో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు .

 

అసలే హిట్ లేని హీరో ఈ రకంగా కథ రాసుకోవడం ఎందుకు అది కూడా ప్లాప్ అయ్యిందనుకోండి మరింతగా పరువు పోగొట్టుకోవడం తప్ప . హీరోలు నటించాలి , అది వదిలేసి మిగతా విషయాల్లో జోక్యం చేసుకుంటూ పొతే ……. సరైన కథ ని ఎంచుకోక పొతే ఇలాంటి ఫలితాలే వస్తాయి . కాబట్టి రాసే వాళ్ళు వేరు ఆ పనిని వాళ్ళని చేయనిచ్చి మంచి కథ ఎంచుకుంటే హిట్ వస్తుంది కానీ చెత్త కథలను ఎంచుకుంటూ ప్లాప్ లు వస్తే మిగతా వాళ్ళ మీద నెట్టేస్తూ హిట్ కోసం కథ రాసుకుంటున్నాను అంటే ఎలా హీరో ? నీకిది అవసరమా ?

English Title : Sai dharam tej turns writer ?