సరిలేరు నీకెవ్వరు టీజర్ రిలీజ్ డేట్ అండ్ టైమ్ ఇవే


Sarileru Neekevvaru teaser release date and time announced
Sarileru Neekevvaru teaser release date and time announced

మొత్తానికి సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్స్ షురూ కాబోతున్నాయి. అలా ఇలా కాకుండా ఓ రేంజ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు 26వ సినిమా సరిలేరు నీకెవ్వరు చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ టీజర్ రిలీజ్ తో రచ్చ లేపబోతున్నాయి. ఇన్నాళ్లూ అల వైకుంఠపురములో టీమ్ వరసగా పాటలను విడుదల చేస్తూ సరిలేరు టీమ్ పై ఒత్తిడి పెంచిన నేపథ్యంలో మహేష్ అండ్ కో టీజర్ రిలీజ్ తో దానికి సమాధానం చెప్పబోతున్నారు. ఇదివరకే అనిల్ రావిపూడి టీజర్ సిద్ధం చేస్తున్నాం అని ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు కొద్దిసేపటి క్రితం టీజర్ ను ఎప్పుడు రిలీజ్ చేయబోయేది చెప్పడం విశేషం.

సరిలేరు నీకెవ్వరు చిత్రానికి సంబంధించిన టీజర్ నవంబర్ 22న సాయంతం 5 గంటల 4 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. మొదటినుండి ఈ చిత్రానికి 9 సెంటిమెంట్ ను వాడుతున్నారు టీమ్. ఈ టీజర్ ప్రకటన కూడా సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు చేయడం విశేషం. టీజర్ రిలీజ్ డేట్ అండ్ టైమ్ వచ్చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. మహేష్ మాస్ అవతార్ లో ఊర కామెడీ పండించబోతున్నాడని ఇప్పటికే రూమర్స్ చక్కర్లు కొడుతున్న తరుణంలో మహేష్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. ఎలాగైనా ఈ సినిమాతో ఒక మాస్ బ్లాక్ బస్టర్ కొట్టాలని వాళ్ళు ఎదురుచూస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్న విషయం తెల్సిందే. అయితే అదే రోజున అల వైకుంఠపురములో వస్తుండడంతో ఒక రోజు గ్యాప్ ఇస్తే రెండు చిత్రాలకు మంచిదని భావించి సరిలేరు సినిమాను ఒకరోజు ముందుకు తీసుకొచ్చే ఆలోచనలు కూడా  ఉన్నాయి.

అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా కనిపించనుంది. విజయశాంతి 13 ఏళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని దిల్ రాజు భాగస్వామ్యంతో నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.