కేసీఆర్ కుటుంబంపై విరుచుకుపడిన శ్రీ రెడ్డి


Sri reddy sensational comments on KCR family
తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం పై విరుచుకుపడింది వివాదాస్పద నటి శ్రీ రెడ్డి  . అయితే నేరుగా కేసీఆర్ పేరు కానీ కేటీఆర్ పేరు కానీ కవిత పేరు కానీ చెప్పలేదు అయితే తండ్రికి మందు ముట్టనిదే నిద్ర పట్టదు , కొడుక్కి పక్కలో అమ్మాయి లేకపోతే నిద్ర పట్టదు కూతురు కి కబ్జా చేయకపోతే నిద్ర పట్టదు అంటూ ఆ ముగ్గురిపై విమర్శలు చేసింది శ్రీ రెడ్డి . తెలంగాణలో నిన్న పోలింగ్ కావడంతో కేసీఆర్ కు ఓటు వేయొద్దని , తెరాసని అధికారం నుండి తరిమి కొట్టాలని పిలుపునిచ్చింది శ్రీ రెడ్డి .

అయితే శ్రీ రెడ్డి తెలంగాణలో లేదు , చెన్నై లో ఉంది . నన్ను కొంతమంది బెదిరించారని , హైదరాబాద్ లో ఉన్న ఇల్లు కూడా లేకుండపోతుందన్న భయంతో ఉన్నానని కేసీఆర్ కుటుంబం పై ఆరోపణలు చేస్తోంది . అంతేకాదు నిజామాబాద్ జిలా ఆర్ముర్ లో పోటీ చేస్తున్న తాజా మాజీ ఎం ఎల్ ఏ జీవన్ రెడ్డి ని గెలిపించొద్దని అతడు కూడా అమ్మాయిలతో సరసాలు ఆడుతుంటాడని అతడికి ఒక్క ఓటు కూడా వేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది .

English Title: Sri reddy sensational comments on KCR family