టాలీవుడ్ లో విషాదం : విజయనిర్మల కన్నుమూత

vijaya nirmala
vijaya nirmala

ప్రముఖ నటి , దర్శకురాలు , నిర్మాత విజయనిర్మల(73 ) అర్ధరాత్రి కన్నుమూశారు. కొద్దిరోజులుగా గచ్చిబౌలి లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విజయనిర్మల ఈరోజు తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. సూపర్ స్టార్ కృష్ణ తో అత్యధికంగా 47 చిత్రాల్లో నటించి సంచలనం సృష్టించింది విజయనిర్మల. అలాగే మహిళా దర్శకురాలిగా గిన్నిస్ బుక్ రికార్డ్ సృష్టించింది. 44 చిత్రాలకు దర్శకత్వం వహించింది విజయనిర్మల.

1946 ఫిబ్రవరి 20 న తమిళనాడు లో జన్మించింది విజయనిర్మల. బాలనటిగా చిత్రరంగంలో అడుగుపెట్టి 200 చిత్రాలకు పైగా నటించింది. అయితే అందులో ఎక్కువగా కృష్ణతోనే నటించడంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది దాంతో రెండో వివాహం చేసుకున్నారు. నటుడు నరేష్ విజయనిర్మల కొడుకు అన్న విషయం తెలిసిందే. విజయనిర్మల అకాల మృతితో టాలీవుడ్ విషాదంలో మునిగింది.