25 లక్షల సహాయం చేసిన బాలయ్య



Balakrishna donates Rs 25 Lakhs 

నటసింహం నందమూరి బాలకృష్ణ శ్రీకాకుళం జిల్లా ని ఆదుకునే నిమిత్తం 25 లక్షల ఆర్ధిక సహాయం అందించాడు . ఇటీవల ఆంధ్రపదేశ్ లోని శ్రీకాకుళం , విజయనగరం జిల్లాలు తిత్లి భీభత్సంతో అతలాకుతలం అయిన విషయం తెలిసిందే . ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ఘోరంగా దెబ్బతింది దాంతో ఆ జిల్లా ని ఆదుకునే నిమిత్తం పలువురు సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు . ఎన్టీఆర్ 15 లక్షలు , కళ్యాణ్ రామ్ 5 లక్షలు , విజయ్ దేవరకొండ 5 లక్షలు , సంపూర్నేష్ బాబు 50 వేలు , వరుణ్ తేజ్ 5 లక్షలు , అనిల్ రావిపూడి ,తదితరులతో పాటుగా మిగతా వాళ్ళు కూడా సహాయాన్ని ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు .

ఇక హీరో నిఖిల్ అయితే తన మిత్ర బృందంతో కలిసి నేరుగా శ్రీకాకుళం కు వెళ్లి బాధితులకు తక్షణ సహాయంగా వస్తువులను అందించాడు . ఇక బాలయ్య కూడా తనవంతు సహాయంగా 25 లక్షలను అందించాడు . ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ తో బిజీ గా ఉన్న బాలయ్య ఆ సినిమాని త్వరగా పూర్తిచేసి జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా విడుదల కానుంది .

English Title: Balakrishna donates Rs 25 Lakhs