డిస్కో రాజా ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్


డిస్కో రాజా ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్
డిస్కో రాజా ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్

మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ చిత్రం డిస్కో రాజా విడుదలకు సిద్ధమైన విషయం తెల్సిందే. డిసెంబర్ 24న ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే సెన్సార్ పూర్తయింది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రాన్ని కట్స్ ఏం లేకుండా యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ చిత్రంలో రవితేజ సరసన హీరోయిన్లుగా నభ నటేష్, పాయల్ రాజ్ పుత్, తాన్య హోప్ నటించారు. ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి చిత్రాన్ని తెరకెక్కించిన టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ విఐ ఆనంద్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసారు. సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రం చాలా విభిన్నంగా ఉంటుందని తెలుస్తోంది.

రవితేజకు ఈ సినిమా హిట్ అవ్వడం చాలా ముఖ్యం. ఎందుకంటే మాస్ మహారాజా నటించిన గత మూడు సినిమాలు కూడా దారుణమైన పరాజయాన్ని చవిచూశాయి. ఈ నేపథ్యంలో తన మార్కెట్ ను పదిలపరుచుకోవాలంటే ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి. అయితే ప్రోమోలు, పాటలు చాలా కొత్తగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఈరోజు విడుదల చేసిన ఫ్రీక్ అవుట్ అయితే స్టాండౌట్ గా నిలిచిందని చెప్పవచ్చు.

ఇక ఈ చిత్రం బిజినెస్ గురించి మాట్లాడుకుంటే రవితేజ కెరీర్ లో వన్ ఆఫ్ ది కాస్ట్లీస్ట్ సినిమాగా డిస్కో రాజా నిలుస్తుంది. కథ మీద నమ్మకంతో నిర్మాత రజినీ తాళ్లూరి ఈ సినిమాకు అడిగినంత ఇచ్చారు. అయితే బిజినెస్ పరంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 19.5 కోట్ల మేర అమ్ముడుపోయింది. అంటే ఈ సినిమా హిట్ అన్న స్టేటస్ సంపాదించుకోవాలంటే కనీసం 22 కోట్లయినా వసూలు చేయాలి.

డిస్కో రాజా ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్:
నైజాం : Rs  6.00 Cr
సీడెడ్ : Rs  2.75  Cr
ఉత్తరాంధ్ర : Rs 1.95 Cr
గుంటూరు : Rs 1.50 Cr
కృష్ణ : Rs 1.25 Cr
ఈస్ట్ గోదావరి : Rs  1.25 Cr
వెస్ట్ గోదావరి : Rs 1.05 Cr
నెల్లూరు : Rs 0.65 Cr
ఆంధ్ర + తెలంగాణ : Rs 16.40 Cr
కర్ణాటక : Rs 1.10 Cr
రెస్ట్ ఆఫ్ ఇండియా : Rs 0.50 Cr
ఓవర్సీస్ : Rs 1.50 Cr
వరల్డ్ వైడ్ : Rs 19.50 Cr